Tue Nov 26 2024 17:43:29 GMT+0000 (Coordinated Universal Time)
ఈ హామీలు టీఆర్ఎస్ ను దెబ్బతీస్తాయా..?
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయంగా కనపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ సీనియర్ నేతలు బుధవారం గాంధీ భవన్ లో సమావేశమై ఎన్నికల హామీలు, మ్యానిఫెస్టో గురించి చర్చింది. ఎన్నికల్లో ఇవ్వబోయే హామీలను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు
- ఇళ్లు లేని కుటుంబాలకు రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు అదనంగా మరో లక్ష రుపాయలు.
- ఇప్పటికే నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో అదనంగా మరో గది నిర్మాణానికి రూ.2 లక్షలు.
- తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రతీ వ్యక్తి 7 కిలోల సన్న బియ్యం.
- మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు.
- కళ్యాణలక్ష్మీతో పాటు బంగారు తల్లి పథకం కూడా కొనసాగింపు.
- వికలాంగులను వివాహం చేసుకుంటే రెండు లక్షల బహుమానం.
- 200 యూనిట్ల వరకు పేదలకు ఇచిత కరెంట్.
Next Story