Fri Dec 27 2024 02:28:24 GMT+0000 (Coordinated Universal Time)
వారిపై చర్యలు తీసుకోండి... టీఆర్ఎస్ ఫిర్యాదు..!
టీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ శానసమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. ఇవాళ వారు శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ను కలిసి ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎమ్మెల్సీలు కొండా మురళి, భూపతి రెడ్డి ,యాదవ రెడ్డి, రాములు నాయక్ పార్టీ మారారని, వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీలు పార్టీ మారే సమయంలో ఇచ్చిన ప్రకటనల ఆధారంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీల్లో ఇద్దరు స్థానిక సంస్థ కోటాలో ఎన్నికవగా, ఒకరు గవర్నర్ కోటాలో, మరొకరు ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన విషయం తెలిసిందే.
Next Story