శ్రావణి కేసులో A1 ఎవరు…? A2 ఎవరు…?
శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి.. నిన్నటి వరకు దేవరాజ్ చుట్టూ తిరిగిన కేసు కాస్త నేడు సాయి మెడకు చుట్టుకుంది.. రెస్టారెంట్ వద్ద దొరికిన సీసీటీవీ [more]
శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి.. నిన్నటి వరకు దేవరాజ్ చుట్టూ తిరిగిన కేసు కాస్త నేడు సాయి మెడకు చుట్టుకుంది.. రెస్టారెంట్ వద్ద దొరికిన సీసీటీవీ [more]
శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి.. నిన్నటి వరకు దేవరాజ్ చుట్టూ తిరిగిన కేసు కాస్త నేడు సాయి మెడకు చుట్టుకుంది.. రెస్టారెంట్ వద్ద దొరికిన సీసీటీవీ ఫుటేజ్ సాయిని అడ్డంగా బుక్కయ్యేలా చేసింది… దింతో పోలీసులు నేడు సాయిని విచారిస్తున్నారు.. సస్పెన్స్ త్రిల్లర్ గా కొనసాగుతున్న ఈ కేసులో ఈరోజైన ఓ క్లారిటీ వస్తుందా..? ఇంతకీ ఈ కేసులో ఎ1 ఎవరు… కాబోతున్నారు..? ఎ2గా ఎవరు నిలువనున్నారు..?
ఆత్మహత్యకు ముందు……
శ్రావణి కేసులో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. గత రెండు రోజులుగా దేవరాజ్ స్టేషన్ లోనే ఉంచుకుని పోలీసులు విచారిస్తున్నారు. అతడి నుండి పలు కీలక అంశాలను రాబట్టగలిగారు. పలు కాల్ రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు రోజు శ్రావణి, దేవరాజ్ లు శ్రీకన్య రెస్టారెంట్ లో కలుసుకున్నారు. ఇద్దరి కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి వారిద్దరితో వాగ్వాదానికి దిగాడు. దేవరాజ్ ను అక్కడీ నుండి పంపించేసిన శ్రావణితో సాయి ఘర్షణకు దిగాడు.. ఆమెపై దాడి చేశాడు.
శ్రావణిని బెదిరిస్తున్న…
ఇప్పుడి ఈ కేసులో సాయి కీలకంగా మారనున్నాడు. రెస్టారెంట్ వద్ద సాయి శ్రావణిని బెదిరిస్తున్న సీసీటీవీ ఫుటేజీలు లభ్యం కావడంతో ఆరోజు రెస్టారెంట్ వద్ద ఏమి జరిగిందో అన్న విషయం బహిర్గతమైంది.. శ్రావణిని సాయి సీరియస్గా బెదిరించినట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. శ్రావణిని ఆటోలో తీసుకెళ్లేందుకు సాయి ప్రయత్నించాడు. చివరకు ఆటో ఎక్కేందుకు శ్రావణి నిరాకరించడంతో రోడ్డు మీదే ఆమెతో గొడవ పడ్డాడు. బెదిరింపులు తట్టుకోలేక చివరికి శ్రావణి ఆటో ఎక్కినట్లు వెళ్లింది.. శ్రావణిని అంత తీవ్రంగా బెదిరించే ఫుటేజ్ లభ్యం కావడంతో విచారణ కీలకం కానుంది. రెస్టారెంట్లో సాయి తనపై దాడి చేశాడని శ్రావణి చెప్పిన ఆడియో సైతం ఈ కేసులో కీలకంగా మారనుంది.
పలు కోణాల్లో విచారణ…
దీంతో పోలీసులు దేవరాజ్ ను పక్కన పెట్టి సాయిని విచారణకు పిలిచారు.. సాయిని పలు కోణాల్లో విచారించనున్నారు. అసలు శ్రావణికి సాయికి మధ్య సంబంధం ఏంటి.. సాయి అసలు శ్రావణి కుటుంబలోకి ఎలా ఎంటర్ అయ్యాడు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కూడా నడిచిన సందర్భంలో ఎంత కాలం పాటు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు… అసలు దేవరాజ్ కు సాయికి మధ్య విభేదాలు ఏంటి…?ఆరోజు రెస్టారెంట్ వద్ద అంత సీరియస్ శ్రావణితో వాగ్వాదానికి దిగడానికి గల కారణాలు ఏంటి అని పలు కోణాల్లో సాయి పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
దేవరాజ్ తో సన్నిహితంగా ఉండటంతో…..
సాయి శ్రావణి రిలేషన్ లో ఉండగానే టిక్ టిక్ ద్వారా దేవరాజ్ శ్రావణికి పరిచయమయ్యాడు. అలా కొంతకాలం మాట్లాడుకున్న తర్వాత ఇరువురు మధ్య ప్రేమ చిగురించింది. ఇక అప్పటినుంచి శ్రావణి సాయిని దూరం పెడుతూ వచ్చింది.. ఇది సాయి భరించలేకపోయాడు.. ఇంతకాలం తనతో రిలేషన్ లో ఉన్న శ్రావణి ఇప్పుడు దేవరాజ్ తో సన్నిహితంగా ఉండటంతో రగిలిపోయాడు.. శ్రావణి కుటుంబ సభ్యులతో వారిద్దరి విషయం చెప్పాడు.. అప్పటినుంచి శ్రావణికి వేధింపులు మొదలయ్యాయి. ఆత్మహత్య కు ముందు రోజు సాయి దేవరాజ్ లు కలుసుకోవడం సహించంలేక పోయిన సాయి రెస్టారెంట్ లో దాడికి దిగాడు.. ఇద్దరు కలుసుకున్న విషయాన్ని సాయి, శ్రావణి కుటుంబ సభ్యులకు చెప్పటంతో వారుకుడా ఆమెను హింసించడంతో తట్టుకోలేకపోయిన శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. శ్రావణి కేసు అనూహ్యంగా సాయి వైపు యూటర్న్ తీసుకుంది… ఈ కేసులో దేవరాజ్ ప్రమేయం ఉన్నప్పటికీ సాయే కీలకంగా మారనున్నాడు.