Mon Dec 23 2024 19:52:47 GMT+0000 (Coordinated Universal Time)
కలర్ ఫుల్ చిలక.. ఈసారి మూడు టిక్కులతో ట్విట్టర్ వెరిఫికేషన్
సెలబ్రిటీల వ్యక్తిగత ఖాతాలకు బ్లూ టిక్, ప్రభుత్వ సంస్థలకు గ్రే టిక్, వ్యాపార సంస్థలకు గోల్డ్ టిక్ ఇచ్చేలా.. ట్విట్టర్..
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ తిరిగి తన చేజిక్కించుకున్నప్పటి నుండి అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వచ్చీరావడంతోనే.. వేలమంది ఉద్యోగులపై వేటు వేసి.. షాకిచ్చారు. ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెరగడంతో.. కొందరు రాజీనామాలు చేసేందుకు సిద్ధపడ్డారు. ఆ తర్వాత కొత్తగా ఉద్యోగులను తీసుకుంటామని మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ తొలినాటి నుండి నేటి వరకూ వెరిఫికేషన్ కు ఒక్క బ్లూ టిక్ మాత్రమే ఉండేది. ఈ టిక్ విషయంలో మస్క్ మార్పులు చేశారు.
సెలబ్రిటీల వ్యక్తిగత ఖాతాలకు బ్లూ టిక్, ప్రభుత్వ సంస్థలకు గ్రే టిక్, వ్యాపార సంస్థలకు గోల్డ్ టిక్ ఇచ్చేలా.. ట్విట్టర్ సరికొత్తగా ముందుకొచ్చింది. ఈ మూడు రంగుల టిక్ లతో ట్విట్టర్ కలర్ ఫుల్ గా మారనుంది. ఇదిలా ఉండగా.. ట్విట్టర్లో చాలా బోగస్ అకౌంట్లు బ్లూ టిక్ తీసుకుంటున్నాయని, వీటిని ఆపేందుకు చర్యలు తీసుకుంటామని మస్క్ ఇటీవల పేర్కొన్నారు. అలాగే హింసను ప్రేరేపించే పోస్టులు చేసే ఖాతాలను నిర్మొహమాటంగా తొలగిస్తామని మోహమాటం లేకుండా చెప్పేశారు.
Next Story