Mon Dec 23 2024 08:52:46 GMT+0000 (Coordinated Universal Time)
చూసుకొని మురవాలి.. చెప్పుకొని ఏడ్వాలి : కవిత వర్సెస్ రేవంత్
తెలంగాణాలో నిర్మించిన ప్రాజెక్టులకు జాతీయ హోదా , రాష్ట్రానిని రావాల్సిన జాతీయ హోదా, పెండింగ్ జీఎస్టీ బకాయిల..
హైదరాబాద్ : రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ పై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ట్వీట్టర్ వార్ కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్,ఎమ్మెల్సీ కవిత, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ఇవాళ ఉదయం నుంచి ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు సందించుకుంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణపై ఎప్పుడు లేని ప్రేమ ఇప్పుడెందుకు వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ కానీ, ఆయన పార్టీ కానీ ఎన్నిసార్లు తెలంగాణ అంశాలు, హక్కులను ప్రస్తావించారో తేల్చి చెప్పాలన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు కేసీఆర్ పోరాడుతుంటే అప్పుడు రాహులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
తెలంగాణాలో నిర్మించిన ప్రాజెక్టులకు జాతీయ హోదా , రాష్ట్రానిని రావాల్సిన జాతీయ హోదా, పెండింగ్ జీఎస్టీ బకాయిల గురించి తాము పోరాటం చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటు మంత్రి కేటీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ స్టడీ టూర్ కి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. ఉత్తమ రైతు, స్నేహ పూర్వక పద్ధతులను తెలుసుకొని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు. కేటీఆర్, కవితకు రేవంత్ రెడ్డి గట్టింగానే కౌంటర్ ఇచ్చారు. రుణమాఫీ ఏదీ? ఎరువులు ఫ్రీ ఎక్కడ ఇచ్చారు? గల్లీలో లొల్లి ఢిల్లీకి పోయి మోదీ ముందు మోకరిల్లి మీరేనా ప్రశ్నించేది? రాష్ట్రంలో పంట నష్టపోయి రైతులు ఆత్మహత్యలు పాల్పడుతున్న కనీసం వారిని పరామర్శించేందుకు పోని మీరా ప్రశ్నించేది?, ఇవే కదా నిజాలు. తెలంగాణ ప్రజలు మరింత గట్టిగా చెప్పాడానికే రాహుల్ గాంధీ వస్తున్నారని' రేవంత్ ఘాటుగానే బదులిచ్చారు.
కవిత అడిగిన ప్రశ్నలకు రేవంత్ బదులిస్తూ, మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు టీఆర్ఎస్ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి మోడీ ముందు మోకరిల్లి ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వమని లేఖ ఇచ్చినప్పుడు మీరెక్కడున్నారు? అని ఎమ్మెల్సీ కవితపై రేవేంత్ రెడ్డి మండిపడ్డారు. రైతులు వరి వేయొద్దని చెప్పి మీ తండ్రి తన ఫాం హౌస్ లో వరి వేసినప్పుడు మీరెక్కడున్నారు అని విమర్శించారు. రైతులు పంట నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కూడా పరామర్శించేందుకు వెళ్లలేదని అప్పుడు మీరెక్కడున్నారని ప్రశ్నలవర్షం కురిపించారు రేవంత్ రెడ్డి. రైతులు పండించి ధాన్యానికి మద్దతు ధర 1400 నిర్ణయించడం ఏమిటన్నారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యపు రాశులు తడిచి రైతులు విలపిస్తున్నారని. వారి కష్టాన్ని పట్టించుకోలేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రైతులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
Next Story