ఆయన రావడం.. లాంఛనమే!
ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ అధికారంలోకి రావడం లాంఛనమే అని బ్రిటిన్‌కు చెందిన గార్డియన్ పత్రిక ఓ సంచలన వార్తను ప్రచురించింది. ఆదివారం ప్రచురితమైన ఓ ప్రత్యేక కథనంలో ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను బట్టి కేంద్రంలో భాజపా మూడోసారి కొలువు తీరడం నల్లేరు మీద నడకే అని పేర్కొంది. దేశంలోని రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు అభిప్రాయాలతో సమగ్రంగా ప్రచురితమైన ఈ కథనం దేశంలోని పొలిటికల్ పార్టీల్లో సంచలనం రేపుతోంది.
గార్డియన్ సంచలన కథనం

దేశంలోని హిందుత్వ సెంటిమెంట్‌ను రగల్చడంలో అధికార పార్టీ విజయం సాధించిందని ఆ పత్రిక పేర్కొంది. హిందూవాదిగా మోదీ పాపులారిటీ బాగా పెరిగింది. మెజారిటీగా ఉన్న హిందువులు ఆయనను మూడోసారి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని గార్డియన్ వెల్లడిరచింది. ‘ఇటీవల మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు అధికార పార్టీలో జోష్ నింపాయని, ఆ ఉత్సాహం కూడో మూడో విజయానికి ఓ కారణం. చంద్రయాన్ విజయవంతం కావడం, వికసిత భారత్ , ఆర్మీ పాయింట్ల వద్ద సెల్ఫీ అంటూ భాజపా చేస్తున్న ప్రచారం.. ఇవన్నీ కూడా మోదీ విజయానికి సోపానాలు. సరిగ్గా ఎన్నికల ముందు జరుగుతున్న రామమందిర ప్రారంభోత్సవం కూడా అధికార పార్టీకి లాభిస్తుంది’ అంటూ గార్డియన్ పేర్కొంది.
మోదీ రాకతో దేశంలో కీలకమైన వర్గాల మధ్య మత సామరస్యం దెబ్బ తిందని కొంతమంది విశ్లేషకులు ఈ కథనంలో అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారం భాజపా వాడుతున్న భాష కూడా హిందువుల ఓట్లను గుంపగుత్తగా సాధించేలా ఉందని ఆయన చెప్పారు. ఇండియా బ్లాక్ అనే ప్రతిపక్షాల కూటమి ఉన్నా, కీలక విషయాల్లో ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యత లేదని గార్డియన్ వెల్లడించింది. సర్వేల్లోనే కాదు , విదేశీ మీడియాలో కూడా మోదీ నామమే జపిస్తున్నారు.