వైఎస్సార్ తో ఉండవల్లి అరుణ్ కుమార్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తన అనుబంధంపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్ తో ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తకాన్ని రచించారు. [more]
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తన అనుబంధంపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్ తో ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తకాన్ని రచించారు. [more]
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తన అనుబంధంపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్ తో ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని ఇవాళ హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో ఆవిష్కరించారు. తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ జాస్తి చలమేశ్వర్, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు, మాజీ సీఎస్ లు మోహన్ కందా, అరవిందరావు, ఐవైఆర్ కృష్ణారావు, రమాకాంత్ రెడ్డి, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ… తాను ఈ పుస్తకంలో వైఎస్ ను దేవుడిలా చూపించడానికి ఈ పుస్తకం రాయలేదని, ఆయనతో తన అనుబంధాన్ని, ఆయన ఎలాంటి వారో చెప్పడానికే రాశానని తెలిపారు. కేవీపీ రామచంద్రరావు సతీమణి సునీత ప్రోత్సాహంతో ఈ పుస్తకం తెచ్చినట్లు తెలిపారు. తన లాంటి వారు వైఎస్సార్ జీవితంలో వేల మంది ఉన్నారని పేర్కొన్నారు. 1983లో ఆయన పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు తాను రాజమండ్రిలో ఓ కార్యకర్తనని, అప్పటి నుంచి వైఎస్ తో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను ఈ పుస్తకంలో రాసినట్లు తెలిపారు. వైఎస్సార్ జీవితం తెరిచిన పుస్తకమని, ఆయన జీవితం అందరికీ తెలిసిందేనన్నారు. ఆయన ఎలాంటి వారో ఈ పుస్తకంతో తెలియని వారికి కూడా అవగాహన వస్తుందన్నారు.
ప్రజాధరణ కలిగిన వ్యక్తి
ప్రజలతో సంబంధాలు పెంచుకున్న నాయకులను తాను గౌరవిస్తానని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ అన్నారు.ఏపీలో తాను చూసినంతవరకు వ్యక్తిగతంగా ఎక్కువ ప్రజాధరణ పొందిన వ్యక్తులు ఎన్టీఆర్, వైఎస్ఆర్ మాత్రమేనన్నారు. అంతటి ప్రజాధరణ పొందడం సామాన్య విషయం కాదన్నారు. డబ్బుతో ఎంపీగానో, ఎమ్మెల్యేగానో గెలవవచ్చు కానీ ప్రజాధరణ పొందలేరన్నారు. వైఎస్ కున్న ప్రజాధరణను చూసి ఆయనను అభిమానించానన్నారు. వైఎస్ అకాలమరణం బాధాకరణమన్నారు.