ఫలితాలపై పెదవి విప్పిన ఉండవల్లి…!!!
ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్లుగా ఎన్నికలు ఎక్కడా జరగలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఓ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ… ఉప ఎన్నిక ముందు [more]
ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్లుగా ఎన్నికలు ఎక్కడా జరగలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఓ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ… ఉప ఎన్నిక ముందు [more]
ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్లుగా ఎన్నికలు ఎక్కడా జరగలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఓ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ… ఉప ఎన్నిక ముందు కేవలం నంద్యాలలో మాత్రమే డ్వాక్రా మహిళలకు రూ.4 వేలు ఇచ్చారని, ఇప్పుడు కూడా ఎన్నికల ముందు రూ.10 వేలు ఇచ్చారన్నారు. ఓట్ల కోసం ప్రభుత్వ డబ్బును ఓటర్లకు పంచడం ఏపీలో తప్ప ఎక్కడా జరగలేదన్నారు. అయితే, ఒక ఇంట్లో మహిళలు ఒక పార్టీకి, పురుషులు ఒక పార్టీకి ఓటేశే అవకాశాలు తక్కువ ఉంటాయని, కుటుంబం మొత్తం ఒకే పార్టీకి ఓట్లేస్తారని అన్నారు. పేదవారు మోసం చేయలేరని, కాబట్టి పసుపు కుంకుమ ప్రభావం ఎన్నికలపై ఎంతోకొంత ఉంటుందన్నారు. ఇదే సమయంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ డబ్బులు ఇవ్వకుండా పసుపు కుంకుమ పేరుతో మోసం చేస్తున్నారని వైసీపీ చేసిన ప్రచారం కూడా బాగానే ప్రజల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు.
ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్యే…
జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలనే ప్రచారం కూడా ప్రజల్లోకి వెళ్లిందని స్పష్టం చేశారు. అండర్ కరెంట్, సైలెంట్ వేవ్ అని చంద్రబాబు అంటున్నారంటే టీడీపీ గెలుస్తుందని బయటకు ఎవరూ చెప్పడం లేదనే అర్థమన్నారు. జగన్ 2014 కంటే కొంత బలం పెంచుకున్నారని, చంద్రబాబుకు మాత్రం బీజేపీ, జనసేన పోవడం వల్ల బలం తగ్గిందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారని, వారంతా జనసేనకు ఎక్కువగా ఓటేస్తే టీడీపీకే లాభమని, సగం మంది జనసేనకు వేసి మిగతా వారు వైసీపీకి వేస్తే వైసీపీకి లాభమని అంచనా వేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఉన్నా మొత్తంగా టీడీపీ – వైసీపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంచనా వేశారు.