ఫలితం తేలకముందే ఆవేశం ఎందుకు బాబూ..?
సీఎస్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభేదాల గురించి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంత అసహనం ఎందుకు [more]
సీఎస్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభేదాల గురించి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంత అసహనం ఎందుకు [more]
సీఎస్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభేదాల గురించి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంత అసహనం ఎందుకు వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇంకా రిజల్ట్ రాకముందే చంద్రబాబు ఎందుకు ఆవేశపడుతున్నారో తెలియడం లేదన్నారు. టీడీపీ ఓడినా ఆ పార్టీ ప్రజల్లో ఉంటుందన్నారు. సీఎస్ తో చంద్రబాబు వివాదానికి బిల్లుల మంజూరే కారణమన్నారు.
ఎందుకు వివాదాలు…?
తనకు అనుకూలంగా ఉండే వారి బిల్లు మంజూరు చేయించుకోవాలనేది చంద్రబాబు తపన అని, అందుకు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అంగీకరించడం లేదన్నారు. అందుకే ఆయనపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులతో చంద్రబాబు ఎందుకు వివాదాలు పెట్టుకుంటున్నారో ఆయనకే తెలియాలన్నారు. 2009లో టీడీపీ ఫిర్యాదుపై తమ జిల్లా ఎస్పీని ఈసీ బదిలీ చేసిందని, అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు చెబితే ఈసీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పారని గుర్తు చేశారు.