మే 3 తర్వాత ఏం చేద్దాం? కొనసాగుతున్న కేబినెట్
కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ పై మంత్రివర్గం చర్చిస్తుంది. కరోనా వైరస్ నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి [more]
కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ పై మంత్రివర్గం చర్చిస్తుంది. కరోనా వైరస్ నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి [more]
కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ పై మంత్రివర్గం చర్చిస్తుంది. కరోనా వైరస్ నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చిస్తుంది. భారత్ లో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలకు చేరుకుంది. తాజాగా విద్యార్థుల పుస్తకాలు, ఎలక్ట్రిక్ ఫ్యాన్ల విక్రయాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. మే 3 తర్వాత లాక్ డౌన్ పై ఏం చేయాలన్న దానిపై ప్రధానంగా కేంద్ర మంత్రి వర్గం చర్చిస్తోంది. ఆర్థిక వ్యవస్థపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. అంతేకాకుండా పొదుపు చర్యలపై కూడా కొన్ని నిర్ణయాలను తీసుకోనుంది. గత నెలలో ఉద్యోగులకు ప్రకటించిన డీఏను వెనక్కు తీసే అవకాశముందని తెలుస్తోంది. కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను పొడిగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చిస్తున్నారు.