Mon Dec 23 2024 12:12:53 GMT+0000 (Coordinated Universal Time)
కుటుంబ రాజకీయాలకు ముగింపు చెబుదాం
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగం సభలో అమిత్ షా మాట్లాడారు. కేసీఆర్ పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పెట్టుకుని అడుగులు వేస్తున్నారని షా ఆరోపించారు. ఎనిమిదేళ్లలో సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి దేశంలో ఒక్క కేసీఆర్ మాత్రమేనని అమిత్ షా మండిపడ్డారు.
సచివాలయానికి వెళ్లని...
వచ్చే ఎన్నికల తర్వాత సచివాలయానికి వెళ్లే అవకాశం బీజేపీకే దక్కుతుందని అమిత్ షా అన్నారు. దేశాన్ని తిరుగోమన దశగా పయనింప చేస్తున్నారన్నారు. ఒక్కసారి బీజేపీకి అవకాశమిస్తే తెలంగాణను దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అమిత్ షా చెప్పారు. తెలంగాఫ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ జరపరని, తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా జరుపుతామని అమిత్ షా తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే ఉండేది కాదని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలకు ముగింపు చెబుదామని అమిత్ షా పిలుపునిచ్చారు.
Next Story