Mon Dec 23 2024 12:15:30 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ ను పడగొట్టి తీరతాం
కేసీఆర్ పడగొట్టేందుకు మునుగోడు ఉప ఎన్నికతో శ్రీకారం చుట్టబోతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు
కేసీఆర్ పడగొట్టేందుకు మునుగోడు ఉప ఎన్నికతో శ్రీకారం చుట్టబోతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకే తాను ఇక్కడకు వచ్చానని అన్నారు. కోమటిరెడ్డిని ఉప ఎన్నికల్లో గెలిపిస్తే కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుందని అమిత్ షా తెలిపారు. టీఆర్ఎస్ పొగలాగా మాయమయిపోతుందని అన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామని అన్నారు ఇచ్చారా? అని ప్రశ్నించారు. మోదీ ఇచ్చే టాయిలెట్లను కూడా కేసీఆర్ అడ్డుకుంటున్నారని అన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఏం చేశారో తెలియదా? అని ప్రశ్నించారు. దళితులకు దళిత బంధు పథకం కింద పది లక్షలు ఇస్తామని చెప్పిన మాట ఏమయిందని, ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తానని అన్నారని, ఎవరికైనా అందిందా? అని అమిత్ షా ప్రశ్నించారు.
ఎవరికి లబ్ది...?
ఎంతమంది దళితులకు ఈ ప్రభుత్వం ద్వారా లబ్డిపొందారన్నారు. ఉపాధి కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ తన కుటుంబసభ్యులకే ఉపాధి కల్పించామని తెలిపారు. మళ్లీ గెలిపిస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ వస్తారని అన్నారు. బీజేపీ అధికారంలో వస్తే దొడ్డు బియ్యం మొత్తాన్ని కొంటామని చెప్పారు. దొడ్డు బియ్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మారిందని అమిత్ షా దుయ్యపట్టారు. తెలంగాణలో పెట్రలో ధర అధికంగా ఉందని అన్నారు. మోదీ ప్రభుత్వం రెండు సార్లు పెట్రోలు ధర తగ్గించినా ఇక్కడ మాత్రం తగ్గించలేదన్నారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Next Story