Sun Nov 24 2024 14:49:36 GMT+0000 (Coordinated Universal Time)
హమ్మయ్య.. ఇక కరోనా మాయమయినట్లే
నిన్న మొన్నటి వరకూ కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుందని భయపెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు
నిన్న మొన్నటి వరకూ కరోనా మరోసారి వ్యాప్తి చెందుతుందని భయపెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం సయితం విమానాశ్రయాల్లో పరీక్షలను నిర్వహించి అక్కడి నుంచే క్వారంటైన్ సెంటర్ కు తరలించాలని ఆదేశించింది. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ కావడం, లక్షల సంఖ్యలో మరణించారన్న వార్తలు రావడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమయి చర్యలకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కరోనా నిబంధలను తూచూ తప్పకుండా అమలయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు కూడా విధించారు.
గణాంకాలు...
అయితే గత కొద్ది రోజులుగా కరోనా లెక్కలు లేవు. ఆసుపత్రిలో కరోనా మరణాలు లేవు. పరీక్షల సంఖ్య కూడా తగ్గినట్లే కనపడుతుంది. ఈ ఏడాది కూడా ఫోర్త్ వేవ్ తో ప్రజలు ఇబ్బంది పెడతారని మీడియా కూడా భయపెట్టింది. ఈ నేపథ్యంలో తమ ఉపాధి అవకాశాలు ఏమయిపోతాయన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. ఈ సమయంలో కరోనా ముప్పు ఇక లేదని తేలిపోయింది. గత కొద్ది రోజులుగా కరోనా సోకిన వారి వివరాలు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించకపోవడంతో ఇక కరోనా ముప్పులేనట్లే భావించవచ్చని వైద్యులు కూడా చెబుతున్నారు. చాలా రాష్ట్రాల్లో జీరో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి.
ఎండాకాలం రావడంతో...
మరోవైపు ఫిబ్రవరిలోనే ఎండాకాలం రావడంతో కరోనా ముప్పు ఇక లేనట్లేనని వైద్య నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. చైనా నుంచి భారత్ కు వైరస్ ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ఈ వార్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. భారత్ లో మూడు డోస్ ల వ్యాక్సిన్ పంపిణీ పూర్తి కావడం, భారతీయులకు ఇమ్యునిటీ ఎక్కువగా ఉండటంతో భయపడాల్సిన పనిలేదని వైద్యులు కొందరు చెప్పినా మందుల కంపెనీలు మాత్రం మరోమారు తమ వ్యాపారానికి సిద్ధమయ్యాయి. అయితే అనూహ్యంగా కరోనా మాయం కావడంతో ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నట్లయింది.
ఈ రాష్ట్రాల్లోనూ...
కరోనాతో సతమతమయిన మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లోనూ కేసులు పూర్తిగా తగ్గిపోవడంతో ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకున్నాయి. అందుకే ఏ రాష్ట్రమూ ఇప్పుడు కరోనా నిబంధనలను అమలు చేయడం లేదు. పర్యాటక ప్రాంతాలు కళకళ లాడుతున్నాయి. రాష్ట్రాల ఆదాయం కూడా పెరిగింది. ఈ ఏడాదికి ఇక కరోనా ముప్పు లేనట్లేనని తెలియడంతో ప్రజలు కూడా మాస్క్ లు ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. మొత్తం మీద కరోనా ఇండియా నుంచి మాయమయినట్లేనన్నది వైద్య నిపుణుల అభిప్రాయంగా ఉంది.
Next Story