Mon Dec 23 2024 14:50:30 GMT+0000 (Coordinated Universal Time)
యూపీఎస్సీ ఫలితాలు విడుదల : మెరిసిన తెలుగు తేజాలు
పర్సనాలిటీ టెస్ట్ ఏప్రిల్ 5 నుండి మే 26, 2022 వరకు జరిగింది. UPSC CSE తుది ఫలితం మెయిన్స్, ఇంటర్వ్యూ రౌండ్లలో అభ్యర్థుల పనితీరుపై
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మే 30న సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2021 తుది ఫలితాలను ప్రకటించింది. శ్రుతి శర్మ టాపర్‌గా నిలిచింది. అంకితా అగర్వాల్ రెండో స్థానంలో నిలవగా, గామిని సింగ్లా మూడో ర్యాంకులో నిలిచారు.
సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష, 2021 ఫలితాలు మార్చి 17న ప్రకటించబడ్డాయి. మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూ రౌండ్ (వ్యక్తిత్వ పరీక్ష) కోసం పిలుస్తారు. పర్సనాలిటీ టెస్ట్ ఏప్రిల్ 5 నుండి మే 26, 2022 వరకు జరిగింది. UPSC CSE తుది ఫలితం మెయిన్స్, ఇంటర్వ్యూ రౌండ్లలో అభ్యర్థుల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఈ పరీక్ష 712 సివిల్ సర్వీసెస్ పోస్టులను భర్తీ చేయడానికి ఉంచారు. మొత్తం 685 మందిని సివిల్ సర్వీసెస్ అపాయింట్ మెంట్ కోసం యూపీఎస్సీ సిఫారసు చేసింది. వీరిలో 244 మంది జనరల్, 73 మంది ఈడబ్ల్యూఎస్, 203 మంది ఓబీసీ, 105 మంది ఎస్సీ, 60 మంది ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు.
సివిల్స్ టాప్ 10 ర్యాంకర్లు వీరే:
శ్రుతి శర్మ
అంకిత అగర్వాల్
గామిని సింగ్లా
ఐశ్వర్య వర్మ
ఉత్కర్ష్ ద్వివేది
యక్ష్ చౌదరి
సమ్యక్ ఎస్ జైన్
ఇషిత రాథీ
ప్రీతమ్ కుమార్
హర్ కీరత్ సింగ్ రంధావా
సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు సాధించారు. యశ్వంత్ కుమార్ రెడ్డికి 15వ ర్యాంకు దక్కింది. పూసపాటి సాహిత్య (24), కొప్పిశెట్టి కిరణ్మయి (56), శ్రీపూజ (62), గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి (69), ఆకునూరి నరేశ్ (117), అరుగుల స్నేహ (136), బి.చైతన్యరెడ్డి (161), ఎస్.కమలేశ్వర రావు (297), విద్యామరి శ్రీధర్ (336), దిబ్బడ ఎస్వీ అశోక్ (350), గుగులావత్ శరత్ నాయక్ (374), నల్లమోతు బాలకృష్ణ (420), ఉప్పులూరి చైతన్య (470), మన్యాల అనిరుధ్ (564), బిడ్డి అఖిల్ (566), రంజిత్ కుమార్ (574), పాండు విల్సన్ (602), బాణావత్ అరవింద్ (623), బచ్చు స్మరణ్‌రాజ్ (676) ర్యాంకులు దక్కించుకున్నారు.
ఈ ఏడాది 180 మంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్), 200 మంది ఐపీఎస్, 37 మంది ఐఎఫ్ఎస్లకు ఎంపికయ్యారు. 242 మంది అభ్యర్థులు గ్రూప్ A సర్వీసులకు, 90 మంది గ్రూప్ B సర్వీసులకు ఎంపికయ్యారు.
IAS- 180
IFS- 37
IPS- 200
సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ A- 242
గ్రూప్ B సేవలు- 90
మొత్తం -749
UPSC CSE తుది ఫలితం 2021: ఫలితాన్ని ఎలా తనిఖీ చేయాలి
స్టెప్ 1: UPSC అధికారిక వెబ్సైట్- upsc.gov.inని సందర్శించండి
స్టెప్ 2: హోమ్‌పేజీలో, UPSC CSE తుది ఫలితం 2021 లింక్‌పై క్లిక్ చేయండి
స్టెప్ 3: pdf ఫార్మాట్లో తుది ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది
స్టెప్ 4: UPSC మెరిట్ జాబితా, రోల్ నంబర్‌ను తనిఖీ చేయండి.. పేజీని డౌన్లోడ్ చేయండి
స్టెప్ 5: ప్రింట్‌అవుట్‌ని తీసుకోండి.
Next Story