నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేశారు..?
డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాల్సిందిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ నేతలను కోరారు. ఇవాళ కాంగ్రెస్ శాసనసభా పక్ష కార్యాలయానికి [more]
డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాల్సిందిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ నేతలను కోరారు. ఇవాళ కాంగ్రెస్ శాసనసభా పక్ష కార్యాలయానికి [more]
డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాల్సిందిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ నేతలను కోరారు. ఇవాళ కాంగ్రెస్ శాసనసభా పక్ష కార్యాలయానికి వచ్చిన ఆయన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్కతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్, కేటీఆర్ మధ్య సరదా సంభాషణ జరిగింది. తన నెంబర్ ఎందుకు బ్లాక్ చేశారంటూ కేటీఆర్ ను ఉత్తమ్ ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూసాయి. తాను బ్లాక్ చేయలేదని, తానే ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయలేదని కేటీఆర్ ఉత్తమ్ కు బదులిచ్చారు. తాను మెసేజ్ లు మాత్రమే చూస్తానని కేటీఆర్ చెప్పారు. ఈ సరదా సంభాషనంతా మీడియా కెమెరాలకు చిక్కింది.