బ్రేకింగ్ : రాజేంద్రప్రసాద్ కు సారీ చెప్పిన వంశీ
తాను మాల వేసుకుని కొంత సంయమనం కోల్పోయి తనకంటే వయసులో పెద్దాయనను దూషించడం తప్పేనని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ కు క్షమాపణ [more]
తాను మాల వేసుకుని కొంత సంయమనం కోల్పోయి తనకంటే వయసులో పెద్దాయనను దూషించడం తప్పేనని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ కు క్షమాపణ [more]
తాను మాల వేసుకుని కొంత సంయమనం కోల్పోయి తనకంటే వయసులో పెద్దాయనను దూషించడం తప్పేనని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ కు క్షమాపణ చెబుతున్నానన్నారు. తనకు బీపీ ఎక్కువ కావడం వల్లనే రాజేంద్ర ప్రసాద్ ను దూషించాల్సి వచ్చిందన్నారు. తాను వాళ్లలాగా బీపీ ట్యాబ్లెట్స్ వాడనన్నారు. తాను హిందూ ధర్మాన్ని తుంగలో తొక్కుతున్నానని, అయ్యప్పమాల వేసుకుని హైందవ ధర్మానికి నష్టం తెస్తున్నానని గ్రీకు వీరులు, కలుగువీరులు కొందరు తనపై విమర్శలు చేస్తున్నారని, తాను టీటీడీలో ఛైర్మన్ పదవులు, బోర్డు మెంబర్ పదవులను అమ్ముకోలేదని వల్లభనేని వంశీ తెలిపారు. విజయవాడ దుర్గగుడిలో తానేమీ క్షుద్రపూజలు చేయలేదన్నారు.
లోకేష కు సవాల్…?
విశాఖ శారదాపీఠానికి ఎవరెవరు వచ్చి పోతున్నారన్న విషయంసీసీ కెమెరాలు పెట్టి తాను చూడలేదన్నారు. నారాలోకేష్ సవాల్ చేసినట్లే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. అలాగే ఎమ్మెల్సీ పదవికి లోకేష్ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. తాను మాల వేసుకుని అన్నాను కాబట్టే రాజేంద్ర ప్రసాద్ కు క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. వైబ్ సైట్లలో తనమీద లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. లోకేష్ అభద్రతా భావానికి లోనై పక్కన తిరిగే వాళ్లపైనే బురద జల్లుతున్నారన్నారు. రాజేంద్రప్రసాద్ కూతురు వివాహానికి తాను డబ్బులు ఇచ్చానని వంశీ తిరిగి అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులందరూ వచ్చి మతిలేని మాటలు మాట్లాడుతున్నారన్నారు.