Mon Dec 23 2024 14:19:20 GMT+0000 (Coordinated Universal Time)
ఉప ఎన్నిక పోలింగ్ ను రద్దు చేయాల్సిందే
తిరుపతి ఉప ఎన్నికల్లో దారుణాలు చోటు చేసుకున్నాయని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. అధికారులు దగ్గరుండి దొంగ ఓట్లను పోల్ చేయించారని అన్నారు. తిరుపతి [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో దారుణాలు చోటు చేసుకున్నాయని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. అధికారులు దగ్గరుండి దొంగ ఓట్లను పోల్ చేయించారని అన్నారు. తిరుపతి [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో దారుణాలు చోటు చేసుకున్నాయని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. అధికారులు దగ్గరుండి దొంగ ఓట్లను పోల్ చేయించారని అన్నారు. తిరుపతి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. దొంగ ఓట్లను అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేయడమేంటని వర్ల రామయ్య ప్రశ్నించారు. పోలీసులు పూర్తిగా వైసీపీ తొత్తులుగా మారిపోయారన్నారు. తిరుపతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ ను పూర్తిగా రద్దు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
Next Story