Mon Dec 23 2024 08:59:59 GMT+0000 (Coordinated Universal Time)
థియేటర్లో 'లియో' చూస్తూ పెళ్లి చేసుకున్న జంట..
కొన్ని గంటల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఒక జంట.. వీరాభిమానంతో పట్టుబట్టలతోనే థియేటర్ కి వచ్చి సినిమా చూశారు. అంతేకాదు అక్కడే పెళ్లి కూడా చేసేసుకున్నారు.
భారతీయ చలన చిత్రసీమలో.. మారుతున్న కాలంకొద్దీ సినిమా కథనాలు కూడా మారుతూ వస్తున్నాయి. ఇక ఆ కథలకు తగ్గట్టు నటీనటులు, టెక్నీషియన్స్ కూడా మారుతూ వస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇక్కడే అసలు విషయం ఉంది. ఇవన్నీ మారుతున్నప్పుడు మేము చూపించే అభిమానంలో మార్పు ఎందుకు రాకూడదు అంటున్నారు మూవీ లవర్స్. ఈక్రమంలోనే ఇటీవల కాలంలో తమ అభిమాన నటీనటులు కోసం ఫ్యాన్స్ చేసే విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
తాజాగా తమిళనాట ఇళయ దళపతి విజయ్ ఫ్యాన్స్ చేసిన ఒక పని నెట్టింట వైరల్ గా మారింది. నిన్న అక్టోబర్ 19న విజయ్ నటించిన 'లియో' సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరి మన అభిమాన హీరో సినిమా రిలీజ్ అంటే.. ఏ పనులు ఉన్నా పక్కన పెట్టి వచ్చేస్తాం కదా. అయితే ఆ అభిమానంతో మీ పెళ్లి పనులు కూడా పక్కన పెట్టి వస్తారా..? అవును ఇదే జరిగింది. కొన్ని గంటల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఒక జంట.. వీరాభిమానంతో పట్టుబట్టలతోనే థియేటర్ కి వచ్చి సినిమా చూశారు. అంతేకాదు అక్కడే పెళ్లి కూడా చేసేసుకున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. చెన్నైకి చెందిన వెంకటేష్, మంజుల అనే కొత్త జంటకి పెళ్లి చేయడానికి పెద్దలు అక్టోబర్ 20న తేదీ ఫిక్స్ చేశారు. కాగా వీరిద్దరూ విజయ్కి వీరాభిమానులట. తమ పెళ్ళికి ఒక్కరోజు ముందు 19న తమ హీరో మోస్ట్ అవైటెడ్ మూవీ 'లియో' రిలీజ్ అవుతుంటే.. పెళ్లి కారణంతో దానిని మిస్ అవ్వకూడదు అనుకున్నారు. దీంతో పెళ్ళికి కొన్ని గంటలు ముందు సినిమా చూడడానికి పట్టుబట్టలతో వచ్చేశారు.
వీరితో పాటు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కూడా సినిమాకి వచ్చారు. థియేటర్ లో షో పడడానికి ముందు అక్కడ ఉన్న అభిమానులంతా.. వారితో ఇరువురికి ఉంగరాలు మార్పించి వెస్ట్రన్ స్టైల్ వివాహం చేసేశారు. అనంతరం సినిమా చూసి.. ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన నెటిజెన్స్.. ఇదెక్కడి అభిమానంరా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story