Wed Dec 25 2024 06:07:07 GMT+0000 (Coordinated Universal Time)
డ్రైవ్ ఆగదు.. ఎవరినీ వదిలపెట్టేది లేదు
విశాఖ లో భూకుంభకోణాలకు పాల్పడిన వారెవరైనా వదిలపెట్టే ప్రసక్తి లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ డ్రైవ్ కొనసాగుతుందనిచెప్పారు. విశాఖలో ప్రభుత్వ భూముల్లోనే రాజధాని ఉంటుందని [more]
విశాఖ లో భూకుంభకోణాలకు పాల్పడిన వారెవరైనా వదిలపెట్టే ప్రసక్తి లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ డ్రైవ్ కొనసాగుతుందనిచెప్పారు. విశాఖలో ప్రభుత్వ భూముల్లోనే రాజధాని ఉంటుందని [more]
విశాఖ లో భూకుంభకోణాలకు పాల్పడిన వారెవరైనా వదిలపెట్టే ప్రసక్తి లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ డ్రైవ్ కొనసాగుతుందనిచెప్పారు. విశాఖలో ప్రభుత్వ భూముల్లోనే రాజధాని ఉంటుందని తెలిపారు. విశాఖకు ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందని చెప్పారు. విశాఖలో టీడీపీ నేతలు భూ రికార్డులను తారుమారు చేశారని విజయసాయిరెడ్డి తెలిపారు. భూ కుంభకోణాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసేందుకు కూడా వెనుకాడబోమని తెలిపారు. టీడీపీ నేతలు స్వచ్ఛందంగా ఆక్రమించిన భూములను ప్రభుత్వానికి సరెండర్ చేయాలన్నారు. ఏ పార్టీకి చెందిన వారినైనా వదిలపెట్టే ప్రసక్తి లేదన్నారు.
Next Story