కేసీఆర్ పై విజయమ్మ కీలక వ్యాఖ్యలు
కేసీఆర్, బీజేపీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యిందని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ఎన్నికల [more]
కేసీఆర్, బీజేపీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యిందని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ఎన్నికల [more]
కేసీఆర్, బీజేపీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యిందని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ… చంద్రబాబు బీజేపీతో ఉన్నన్ని రోజులూ.. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని కాంగ్రెస్ తో వైసీపీ కలిసిందని ఆరోపించేవారు. ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి ఉన్నందున బీజేపీ, కేసీఆర్, వైసీపీ ఒకటే అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మన రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ సీట్లు వైసీపీనే గెలిపించాలని, కేంద్రంలో ఎల్లయ్య వచ్చినా.. పుల్లయ్య వచ్చినా తమకు సంబంధం లేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిన వారికే వైసీపీ మద్దతు ఇస్తుందన్నారు. కేసీఆర్ కు మన రాష్ట్రానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఒక ఊరి రాజు ఇంకో ఊరికి పోలిగాడు అని పెద్దలంటారని, కేసీఆర్ తో కలవాల్సిన అవసరం జగన్ కు ఏముందని ప్రశ్నించారు.