Tue Jan 14 2025 12:26:58 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ బరువుపై శ్వేతపత్రం విడుదల చేయండి
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అగ్రీగోల్డ్ సహా మట్టి మశానం.. గడ్డి గాదం అన్నీ తినేశారని ఆరోపించారు. 2014 జూన్ 8 నుంచి ఈ రోజు వరకు లోకేష్ బరువు నెల నెలా ఎంత పెరిగిందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఎద్దేవా చేశారు. ఇది ప్రజలకు కూడాఅవసరమన్నారు.
పప్పు నాయుడు గారూ.... మాకు వాటానా? నాలుగున్నరేళ్లుగా ఒక్క అగ్రి గోల్డ్ ఏం ఖర్మ, మట్టి మశానం.. గడ్డి గాదం, అన్నీ తినేశారు. 2014 జూన్ 8 నుంచి ఈరోజు వరకు మీ వెయిట్ నెల నెలా ఎంత పెరిగిందో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. నిజం, ఇందులో పబ్లిక్ ఇంటరెస్ట్ చాలా వుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 21, 2018
Next Story