Sat Jan 11 2025 07:53:52 GMT+0000 (Coordinated Universal Time)
విజయసాయి సంచలన ఆరోపణలు
తెలంగాణ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1200 కోట్లు తరలించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇక్కడ అవినీతి చేసిన సొమ్మును తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున సుమారు 1200 కోట్లు చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ కి ఇచ్చారని తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల కోసం కూడా కాంగ్రెస్ రూ.500 కోట్లు పంపారని ఆరోపించారు. అందుకే ప్రకటనల్లో చంద్రబాబు ఫోటోను ప్రముఖంగా వేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ముందుగా పంపించడం కూడా చంద్రబాబు వ్యూహంలో భాగమేనన్నారు. రావణాసురుడికి ఏ రకంగా 10 తలలు ఉన్నాయో, చంద్రబాబుకు అలానే 10 నాలుకలు ఉన్నాయని విమర్శించారు.
Next Story