కేసీఆర్ కుటుంబ పాలన పోతేనే అభివృద్ది
దళితులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏనాడు గౌరవం, ప్రేమ లేదని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. బడుగు, బలహీనవర్గాలను కేసీఆర్ చిన్నచూపు చూస్తారన్నారు. ఇచ్చిన మాటకు [more]
దళితులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏనాడు గౌరవం, ప్రేమ లేదని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. బడుగు, బలహీనవర్గాలను కేసీఆర్ చిన్నచూపు చూస్తారన్నారు. ఇచ్చిన మాటకు [more]
దళితులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏనాడు గౌరవం, ప్రేమ లేదని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. బడుగు, బలహీనవర్గాలను కేసీఆర్ చిన్నచూపు చూస్తారన్నారు. ఇచ్చిన మాటకు కేసీఆర్ ఏనాడూ కట్టుబడి ఉండలేదని విజయశాంతి తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలన పోతేనే తెలంగాణ అభివృద్ధి సాథ్యమవుతుందన్నారు. టీఆర్ఎస్ నేతల వార్నింగ్ లకు తాము భయపడే ప్రసక్తి లేదని విజయశాంతి చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. ప్రజలే కేసీఆర్ చేత చావు నోట్లో తల పెట్టేలా చేశారని, ఆయన దీక్ష విరమించాలని భావించినా ప్రజలు ఒప్పుకోలేదని విజయశాంతి గుర్తు చేశారు. 2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే 2014లో తెలంగాణ ఎందుకు వచ్చిందని విజయశాంతి ప్రశ్నించారు. దీక్ష చేసినప్పుడే తెలంగాణ రావాలి కదా? అని ఆమె అన్నారు. కేసీఆర్ ఇప్పటికీ తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు.