Wed Jan 15 2025 10:02:49 GMT+0000 (Coordinated Universal Time)
విజయశాంతి బాంబు పేల్చారే...!!
తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి స్వంత పార్టీ నేతల వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 23న మేడ్చల్ లో జరగనున్న సోనియా గాంధీ బహిరంగ సభకు సంబంధించి పార్టీ ఇచ్చిన ప్రకటనలో విజయశాంతి ఫోటో లేదు. దీనిపై ఆమె పెదవి విరిచారు. టీఆర్ఎస్ ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని అంటున్న మనం సోనియా సభ ప్రకటనలో ఒక్క మహిళ ఫోటో కూడా లేకపోవడం సరికాదన్నారు. సభకు కేవలం మగవాళ్లే వస్తారా ? మహిళలు కూడా వస్తారు కదా అని ఆమె వ్యాఖ్యానించారు.
Next Story