Sat Nov 23 2024 03:24:43 GMT+0000 (Coordinated Universal Time)
Virat Kohli : రికార్డు సాధించి.. అవుటైన తరువాత కోహ్లీ ఏం చేశారో చూశారా..?
సచిన్ రికార్డు బ్రేక్ చేసి అవుట్ అయ్యి పెవిలియన్ చేరుకున్న కోహ్లీ చేసిన పని ఏంటో తెలుసా..?
Virat Kohli : క్రికెట్ అభిమానుల చేత రన్నింగ్ మెషిన్, రికార్డుల రారాజు అనిపించుకునే విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డుని క్రియేట్ చేసి చరిత్ర సృష్టించారు. ప్రపంచ వన్డే చరిత్రలో అత్యధిక రికార్డులను సాధించిన ఆటగాడిగా ఇన్నాళ్లు సచిన్ ప్రశంసలు అందుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన స్థానాన్ని కోహ్లీ సొంతం చేసుకున్నారు. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నేడు ముంబైలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో న్యూజిలాండ్, భారత్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
గత ప్రపంచకప్పు సెమీస్ లో కూడా ఈ ఇద్దరి మద్యే పోటీ జరగగా.. అప్పుడు భారత్, న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు భారత్ ఆటగాళ్లు బరిలోకి దిగారు. ఈక్రమంలోనే ఒకరికి మించి ఒకరు గ్రీసులో బౌండరీస్ బాదుతూ స్కోర్ మెషిన్ పరుగులు పెట్టించారు. ఇక రన్నింగ్ మెషిన్ కోహ్లీ 113 బంతుల్లో 117 పరుగులు చేశారు.
నవంబర్ 5న కోహ్లీ పుట్టినరోజున జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ లో విరాట్ సెంచరీ చేసి సచిన్ రికార్డుని ఈక్వల్ చేశారు. నేడు జరిగిన మ్యాచ్ లో మరో సెంచరీ చేసి సచిన్ దాటి విరాట్ కొత్త రికార్డుని సృష్టించారు. ఈ రికార్డుతో అభిమానులు, క్రికెట్ వీక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. అక్కడే స్టేడియంలో ఉన్న సచిన్ కూడా చప్పట్లు కొడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక 113 బంతుల్లో 2 సిక్సర్లు, 9 ఫోర్లతో 117 పరుగులు చేసి అవుట్ అయిన కోహ్లీ పెవిలియన్ కి చేరుకొని ఏం చేశారో తెలుసా..?
ఈ మ్యాచ్ చూడడానికి కోహ్లీ సతీమణి అనుష్క కూడా వచ్చారు. స్టేడియంలో కూర్చొని అభిమానులతో కలిసి కోహ్లీ బ్యాటింగ్ సునామీని ఎంజాయ్ చేశారు. ఇక కోహ్లీ సెంచరీతో అనుష్క కూడా తెగ సంబర పడ్డారు. ఇక పెవిలియన్ చేరుకున్న కోహ్లీ.. అనుష్కకి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వగా ఆమె కూడా రిటర్న్ కిస్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Next Story