Mon Dec 23 2024 19:35:40 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డకు బీజేపీ నేత సూటి ప్రశ్న….వివరణ ఇవ్వాల్సిందే
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి సూటి ప్రశ్న వేశారు. పంచాయతీ ఎన్నికల యాప్ ను ఎవరు తయారు [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి సూటి ప్రశ్న వేశారు. పంచాయతీ ఎన్నికల యాప్ ను ఎవరు తయారు [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి సూటి ప్రశ్న వేశారు. పంచాయతీ ఎన్నికల యాప్ ను ఎవరు తయారు చేశారని, అది ఎవరి అధీనంలో ఉందని విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ యాప్ విషయంలో రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం మాదిరిగానే ఈ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎన్నికల కమిషనర్ పరిశీలిస్తారా? అని అడిగారు. ఇది ఒక రాజకీయ పరా్టీ తయారు చేసిన యాప్ అని విమర్శలున్నాయని, దీనిపై వివరణ ఇవ్వాలని విష్ణువర్థన్ రెడ్డి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రశ్నించారు.
Next Story