డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటి..? దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు
డిజిటల్ రూపాయి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. పెరుగుతున్న సాంకేతికత ..
డిజిటల్ రూపాయి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. పెరుగుతున్న సాంకేతికత కారణంగా ఆధునాత సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. నగదుకు బదులు డిజిటల్ కరెన్సీని వినియోగించే ట్రెండ్ దేశంలో మరింతగా పెరిగిపోతోంది. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే, మన ఇండియాలో క్రిప్టోకరెన్సీని ఉపయోగించే విధానం పెరిగిపోతోంది. అయితే నగదు కరెన్సీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నా.. కొన్ని నష్టాలు కూడా ఉంటున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. సైబర్ నేరాలతో పాటు రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పూర్తిగా దేశీయ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకువచ్చింది. రిజర్వ్ బ్యాంక్ భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్ట్‌ను గత ఏడాదిలోనే ప్రారంభించిన విషయం తెలిసిందే.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని కూడా పిలువబడే డిజిటల్ రూపాయి ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం.. డిజిటల్ కరెన్సీ వినియోగం వాణిజ్యంలో పెను మార్పులకు దారి తీస్తుంది. ఈ నాణేలపై ప్రభుత్వ ముద్ర ఉండడంతో ఆర్థిక మోసం, నష్టం జరిగే అవకాశం ఉండదు. ప్రస్తుతం పెరుగుతున్న ఆన్లైన్ మోసాలను దృష్టిలో ఉంచుకుని ఈ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకువచ్చింది ఆర్బీఐ.డిజిటల్ రూపాయి కోసం ఇప్పటికే తొమ్మిది బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫాస్ట్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంకులు ఉన్నాయి. ఈ విధానానం మరింతగా విస్తరించేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. డిజిటల్ రూపాయిని ప్రారంభించడంలో కొన్ని సాంకేతిక, విధానపరమైన సమస్యలను గుర్తించి అన్ని సమస్యలను తొలగించి ఎలాంటి అడ్డంకులు లేని విధంగా సీబీడీసీని మార్కెట్లోకి తీసుకువచ్చింది.
అసలు డిజిటల్ రూపాయి అంటే ఏమిటి?
దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడంతోపాటు భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా రిజర్వ్ బ్యాంకు డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకువచ్చింది. డిజిటల్ రూపాయి వర్చువల్ కరెన్సీ దానికి ఎటువంటి రిస్క్ లేకుండా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న వర్చువల్ కరెన్సీ. ఇ-రూపాయి డబ్బు లావాదేవీ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఈ విధానం పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే నోట్ల ప్రింటింగ్ విషయంలో కూడా ఖర్చు మరింతగా తగ్గే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్ ఎక్స్ఛేంజ్ సాధ్యమవుతుంది. ఎటువంటి అదనపు లావాదేవీ రుసుము లేకుండా అన్ని చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంటోంది. అయితే ఈ-రూపాయిలు నిజమైన కరెన్సీకి సమానం. అందుకే కాగితం నోట్లకు బదులుగా ఈ కరెన్సీ కూడా ఉపయోగించబడుతుంది.
డిజిటల్ రూపాయి వల్ల ప్రయోజనాలు ఏమిటి..?
యూపీఐ ద్వారా లావాదేవీలకు వినియోగదారుకు బ్యాంక్ అకౌంట్ అవసరం. డిజిటల్ కరెన్సీలకు ఎలాంటి బ్యాంకు అకౌంట్ అవసరం ఉండదు. అలాగే డిజిటల్ కరెన్సీలకు ఎలాంటి గడువు అనేది ఉండదు. ఈ డిజిటల్ కరెన్సీని జీవితాంతం ఉపయోగించుకోవచ్చు. అలాగే, డిజిటల్ కరెన్సీ వల్ల ఏ విధంగాను మోసపోయే అవకాశం ఉండదు. బిట్ కాయిన్ వంటి కరెన్సీలలో ఈ-రూపాయిలు ఆర్థిక ప్రమాదానికి అవకాశం లేదు. ఈ-రూపాయిల వినియోగం వల్ల ప్రభుత్వానికి కూడా చాలా డబ్బు ఆదా అవుతుంది. ఎందుకంటే కాగితపు నోట్ల విషయంలో ముద్రణ, పంపిణీ, నిల్వకు ఎటువంటి ఖర్చు ఉండదు. కాగితంపై ఆధారపడటాన్ని తగ్గించడం వల్ల పర్యావరణం కూడా ఆదా అవుతుంది.