Tue Nov 19 2024 22:20:11 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ కు అది ఇప్పట్లో సాధ్యమవుతుందా?
ఎవరు అవునన్నా కాదన్నా లోకేష్ ను అభిమానించే నేతలు టీడీపీలో అనేక మంది నేతలున్నారు. వారు ప్రస్తుతానికి ద్వితీయ శ్రేణి నేతలే కావచ్చు.
నాయకుడు కావాలంటే కొంత స్వతహాగా రాజకీయ పరిజ్ఞానం అవసరం. ఎక్కడ తగ్గాలో? ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉండాలి. జనం నుంచి వస్తేనే నాయకుడు అవుతాడు. కానీ నారా లోకేష్ దీనికి భిన్నం. ఆయన జనం నుంచి రాలేదు. దొడ్డిదారిన ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టి నాయకుడు అవతారమెత్తారు. ఫలితం రెండున్నరేళ్లకే ఆయన నాయకత్వ ప్రతిభ తెలిసిపోయింది. అలాగని లోకేష్ ను అలా వదిలేస్తారా? టీడీపీకి భవిష్యత్ ఆయనే కదా? చంద్రబాబు తర్వాత పార్టీని లీడ్ చేయాల్సింది లోకేష్ కదా?
హైదరాబాద్ కే...
మరి లోకేష్ ను చంద్రబాబు ఎందుకు దూరం పెడుతున్నారు? లోకేష్ ను జనంలోకి ఇప్పటి నుంచే వదిలేయాలి. ఎక్కడో సంఘటన జరిగితే వెళ్లి అక్కడ లెక్చర్ ఇచ్చి రావడం కాదు. జనం మధ్యలోనే ఉండేలా చూడాలి. అంతెందుకు ముందు అమరావతిలోనే లోకేష్ స్థిర నివాసం ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. కానీ లోకేష్ ఆ పనిచేయరు. ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అక్కడి నుంచే ఏపీకి షటిల్ కొడుతున్నారు.
యువకులంతా....
ఎవరు అవునన్నా కాదన్నా లోకేష్ ను అభిమానించే నేతలు టీడీపీలో అనేక మంది నేతలున్నారు. వారు ప్రస్తుతానికి ద్వితీయ శ్రేణి నేతలే కావచ్చు. లోకేష్ రాకను వారు కోరుకుంటున్నారు. స్వాగతిస్తున్నారు. లోకేష్ వస్తే తాము ఫోకస్ అవుతామన్న స్వార్థం కూడా కావచ్చు. లోకేష్ రాక కోసం జిల్లాల్లో అనేక మంది నేతలు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. ఆయన కంట్లో పడాలని కోరుకుంటున్నారు. కానీ లోకేష్ జిల్లాలకు వెళితే కదా?
జిల్లాలను చుట్టేసి...
లోకేష్ యువకుడు. వయసురీత్యా, ఆరోగ్యరీత్యా ఫిట్ గా ఉన్నాడు. ఈ సమయంలో ఆయన జనం మధ్య, క్యాడర్ తో ఎక్కువ సమయం గడపాల్సి ఉంది. కానీ లోకేష్ కు చెప్పేవారెవరు? ఆయనను నడిపించేవారెవరు? దగ్గరుండి నడిపించాల్సిన తండ్రి చంద్రబాబే చినబాబు అంటే భయపడిపోతున్నారు. జిల్లాలకు పంపితే అక్కడ ఏం విభేదాలు తలెత్తుతాయోనని బెదిరిపోతున్నారు. అందుకే లోకేష్ కు పెద్దగా పార్టీ బాధ్యతలను అప్పగించడం లేదు. మరి లోకేష్ నాయకుడిగా ఎదిగేదెప్పుడు? ఇలాగయితే ఆయన సీఎం సీట్లో కూర్చున్నట్లే?
- Tags
- nara lokesh
- tdp
Next Story