Mon Dec 23 2024 15:54:46 GMT+0000 (Coordinated Universal Time)
మగవాళ్లు శృంగార పురుషులే.. అధిక-రిస్క్ సెక్స్‌లో పురుషులు
తక్కువ కండోమ్ వాడకం వల్ల.. సదరు వ్యక్తులు హెచ్ఐవి/ఎయిడ్స్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
మనుషులని పట్టి పీడిస్తున్న జాడ్యాలలో బహుళ లైంగిక భాగస్వాములను కలిగి ఉండడం కూడా ఒకటి. కారణాలు ఏవైనా లైంగికంగా తన భాగస్వామికి కాకుండా ఇతరులకు దగ్గరవుతూ ఉండడం వలన ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఎన్నో మర్డర్స్ లో అక్రమ సంబంధాలు కూడా ఒక కారణమే..! పెళ్లి కాకుండా లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లేదా అక్రమ సంబంధాలు జీవితాల్లో ఊహించని మార్పులకు కారణం అవుతూ ఉన్నాయి.
ఇక ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉండడంలో ఒకప్పుడు మగవారే టాప్ లో ఉండేవారు. ఇప్పుడు మగవారికి ఆ విషయంలో మహిళలు కూడా ఏ మాత్రం దూరంగా లేరని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెబుతోంది. పురుషులు బహుళ లైంగిక భాగస్వాములను కలిగి ఉంటారని.. అయితే మహిళలు కూడా అందుకు సంబంధించి మరింత ముందుకు వెళుతున్నారని పలువురు వ్యక్తులపై చేసిన సరికొత్త సర్వే ఫలితాలు - నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) ద్వారా తేలింది. ఈ డేటా మొత్తాన్ని 2019-21లో సేకరించారు. భారతదేశంలోని పట్టణ ప్రాంతంలోని మహిళలు ఈ విషయంలో బాగా ముందు ఉన్నారని డేటా చూపిస్తోంది. మహిళల జీవితకాలంలో సగటున 1.5 మంది లైంగిక భాగస్వాములు ఉండగా.. పురుషులకు 1.7 మంది ఉన్నారు.
ఇక కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో స్త్రీలు తమ జీవితకాలంలో పురుషుల కంటే ఎక్కువ లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారని కూడా తెలుస్తోంది. ఉత్తర, మధ్య భారతదేశంలోని రాజస్థాన్, హర్యానా, J&K, MP, తూర్పున అస్సాం, దక్షిణాన తమిళనాడు, కేరళ రాష్టాలలో మహిళలు పురుషుల కంటే ఎక్కువ లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంత మహిళలు.. పట్టణ ప్రాంతాల మహిళలతో పోలిస్తే వారి జీవితకాలంలో (1.8) సగటున ఎక్కువ లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారని డేటా తెలియజేస్తోంది. స్త్రీల కంటే (0.5%) చాలా ఎక్కువ మంది పురుషులు (3.6%).. గత 12 నెలల్లో జీవిత భాగస్వామి కాని లేదా మరో వ్యక్తితో కాని లైంగిక సంబంధం కలిగి ఉన్నారు. తక్కువ కండోమ్ వాడకం వల్ల.. సదరు వ్యక్తులు హెచ్ఐవి/ఎయిడ్స్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. అధిక-రిస్క్ తో కూడిన లైంగిక సంపర్కం కిందకు ఇవి వస్తాయని చెబుతున్నారు. అటువంటి సెక్స్ సమయంలో కండోమ్ వినియోగం తక్కువగా ఉందని ఈ కొత్త డేటాలో తేలింది.
ఈ డేటాకు సంబంధించి.. దాదాపు 1.1 లక్షల మంది మహిళలు, 1 లక్ష మంది పురుషులు భాగస్వామ్యం అయ్యారు. లైంగిక సంబంధాల గురించి పూర్తిగా స్పష్టతతో ఉన్నారని ఊహించడం కష్టంగా ఉన్నప్పటికీ, చాలా మంది ముఖ్యంగా మహిళలు భర్త గురించి కాకుండా.. ఇతర లైంగిక భాగస్వాముల గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారనే వాస్తవం మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తోంది. స్త్రీలు వీటి గురించి తక్కువగా మాట్లాడుతూ ఉండవచ్చు, పురుషులు కేవలం కోరికల కారణంగానే ఇలాంటి బంధాలను పెట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు. గత 12 నెలల్లో ఎంత శాతం మంది మహిళలు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక సంబంధం కలిగి ఉన్నారనే విషయాన్ని కూడా సర్వే లో తెలుసుకున్నారు. పట్టణ ప్రాంత మహిళల కంటే గ్రామీణ మహిళలు ఇందులో ముందు ఉన్నారు. వివాహిత మహిళలు, వివాహం చేసుకోని, విడాకులు తీసుకోని మహిళలు, వితంతువులు.. సర్వేకు ముందు 12 నెలల్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక సంబంధం కలిగి ఉన్నారని చెప్పారు. అధిక-రిస్క్ సెక్స్‌లో పురుషులు ఎక్కువగా పాల్గొంటూ ఉన్నారని డేటా సూచించింది.
హిందూ పురుషులు పెళ్లి కాకుండా లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లేదా అక్రమ సంబంధాలు కలిగి ఉండేందుకు ఇష్టపడుతున్నారు. వారి జీవిత కాలంలో సగటున 2.2 మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారని తెలిపింది. సిక్కులు, క్రైస్తవులు 1.9, బౌద్ధులు, ముస్లింలు సగటు 1.7 మందితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటున్నారు. జైనులు అత్యల్పంగా సగటున 1.1 మంది మాత్రమే. పలువురు మహిళలతో శారీరక సంబంధాల వల్ల లైంగిక పరంగా సంక్రమించే వ్యాధులు, ఎయిడ్స్ వంటి రోగాలు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని కూడా సర్వే పేర్కొంది. 2019-20లో కేంద్ర ప్రభుత్వం కోసం ముంబయికి చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ స్టడీస్ ఈ సర్వేను నిర్వహించింది.
Next Story