జగన్ కే జనం జేజేలు....!!
సర్వేలన్నీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. తాజాగా రిపబ్లిక్- సీఓటరు సర్వేలో మరోసారి జగన్ కు ఆంధ్రప్రదేశ్ లో విజయావకాశాలు ఎక్కువని ఈ సర్వే తేల్చి చెప్పింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రిపబ్లికన్-సీ ఓటరు సర్వే చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయో తేల్చింది. ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జగన్ పార్టీకే అత్యధికంగా లోక్ సభ స్థానాలు వస్తాయని తేల్చింది.
20 లోక్ సభ స్థానాల్లో.....
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 లోక్ సభ స్థానాలుండగా అందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 20 స్థానాలు వస్తాయని సర్వే తేల్చి చెప్పింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేవలం ఐదు స్థానాలతో సరిపెట్టుకోవాలని తేల్చింది. నేషనల్ అప్రూవల్ రేటింగ్స్ పేరిట ఈ సర్వేను దేశవ్యాప్తంగా చేశారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి కేవలం ఎనిమిది లోక్ సభ స్థానాలే వచ్చాయి. ఈసారి మరో 12 స్థానాలను వైసీీపీ కైవసం చేసుకుంటుందని చెప్పింది. అలాగే చంద్రబాబు కేవలం ఐదు స్థానాలకే పరిమితమవుతుందని చెప్పంది. తెలంగాణలో మహాకూటమికి ఎనిమిది స్థానాలు, బీజేపీకి ఒకస్థానం, టీఆర్ఎస్ కు ఏడు స్థానాలు దక్కుతాయని చెప్పింది. మొత్తం మీద అన్ని సర్వేల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు వస్తుండటంతో వైసీపీ నేతల్లో జోష్ పెరిగింది.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- nara chandrababu naidu
- pavan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- రిపబ్లికన్ సీ ఓటరు సర్వే
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- ిrepullican c-voter survey