Sat Nov 23 2024 14:34:58 GMT+0000 (Coordinated Universal Time)
జగన్, కేసీఆర్ ల రహస్య ఒప్పందం...!
ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితోనూ, తెలంగాణలో కె.చంద్రశేఖర్ రావుతోనూ భారతీయ జనతా పార్టీ రహస్య ఒప్పందం చేసుకుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన టీడీపీ పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని జాతీయస్థాయిలో ఎండగట్టేందుకు ప్రయత్నించాలన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమి పై కూడా చర్చ జరిగింది. అయితే కాంగ్రెస్ లేకుండా మూడో కూటమికి అవకాశాలుండవని కొందరు ఎంపీలు అభిప్రాయపడ్డారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలసి వెళ్లాలని చంద్రబాబు అన్నారు. ఏపీలో ఐటీ దాడులు రాజకీయ కక్షతో చేస్తున్నవేనని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- k chandrasekhar rao
- nara chandrababu naidu
- narendra modi
- pawan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కె. చంద్రశేఖర్ రావు
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story