నేడు వైసీపీలోకి కీలక నేత
మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి తనయుడు నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినా కాదని రాజీనామా చేశారు. తమ అనుచురులు, సన్నిహితులతో సుదీర్ఘమంతనాలు జరిపిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఆయన అనుచరులు కూడా వైసీపీలో చేరాలని వత్తిడి తేవడంతో నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
విశాఖ నగరంలో నేడు......
నేడు విశాఖ నగరంలోకి వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేరుకోబోతోంది. గత నెల 14న విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన జగన్ పాదయాత్ర దాదాపు అన్ని నియోజకవర్గాలను టచ్ చేస్తూ వెళుతుంది. ఈరోజు విశాఖ నగరంలోకి ప్రవేశిస్తుంది. ఒక్క గాజువాక నియోజకవర్గం మినహా విశాఖ నగరంలోని అన్ని నియోజవర్గాల నుంచి పాదయాత్ర వెళ్లేలా వైసీపీ నేతలు ప్లాన్ చేశారు. కోటనరవ కాలనీ వద్ద జగన్ ప్రవేశించగానే నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరతారు. ఆయన జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. రామ్ కుమార్ రెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- nara chandrababu naidu
- nedurumilli ramkumarreddy
- pavan kalyan
- telugudesam party
- visakha city
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి
- పవన్ కల్యాణ్
- విశాఖ నగరం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ