బెంగళూరులో జగన్ ను కలవలేదా వంశీ..?
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికలు ముగిసి 25 రోజులు గడుస్తున్నా ఇంకా రాజకీయ వేడి చల్లారడం లేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, [more]
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికలు ముగిసి 25 రోజులు గడుస్తున్నా ఇంకా రాజకీయ వేడి చల్లారడం లేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, [more]
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికలు ముగిసి 25 రోజులు గడుస్తున్నా ఇంకా రాజకీయ వేడి చల్లారడం లేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇది పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. తన ఇంటికి వంశీ రావడం పట్ల, తనను విమర్శించడం పట్ల యార్లగడ్డ సీరియస్ అయ్యారు. ఈ మేరకు సీపీని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇవాళ యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ… వంశీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వంశీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే పైశాచికంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీ దొంగల పార్టీ అని, దొంగలే ఆ పార్టీలో చేరుతారని వంశీ చేసిన విమర్శలపై ఆయన మండిపడ్డారు. వైసీపీ దొంగల పార్టీ అయితే గతంలో జగన్ ను వంశీ ఎందుకు ఆలింగనం చేసుకున్నారని ప్రశ్నించారు. వంశీ దంపతులు బెంగళూరు వెళ్లి జగన్ ను కలవలేదా అని ప్రశ్నించారు. చేతనైతే ప్రజలకు సేవ చేయాలని ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బులతో తాను రాజకీయం చేస్తున్నానని, వంశీలా తాను మట్టి దొంగను కాదన్నారు.