హత్యాయత్నం ఘటనలో మంత్రి ఆది పాత్ర ఉందా?
తమ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై స్వత్పంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వైసీపీ నేతలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం వైసీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు రాష్ట్రపతిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ... జగన్ పై హత్యాయత్నం ఘటనలో చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, నటుడు శివాజి, టీడీపీ నేత, రెస్టారెంట్ యాజమాని హర్షవర్ధన్ పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. డీజీపీ ఠాకూర్ కి ఈ ఘటన జరుగుతున్నట్లు ముందే తెలుసని, వీరిందరూ హత్యకు వ్యూహం పన్నడానికి ముందే సమావేశం అయ్యారని పేర్కొన్నారు. ఈ మేరకు తమవద్ద అన్ని ఆదారాలు ఉన్నాయని, అయితే, రాష్ట్ర పోలీసులకు ఈ ఆదారాలు ఇస్తే వాటిని తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తన పాత్ర లేదని చంద్రబాబు చెప్పదలుచుకుంటే సీబీఐ విచారణకు కోరాలని డిమాండ్ చేశారు.