Wed Jan 08 2025 17:17:23 GMT+0000 (Coordinated Universal Time)
సంబరాల్లో వైసీపీ శ్రేణులు
తెలంగాణ ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. ఇక్కడ ప్రజాకూటమి ఏర్పాటులో, ప్రచారంలో చంద్రబాబుదే కీలక పాత్ర. ప్రజాకూటమి గెలిస్తే ఆ క్రెడిట్ చంద్రబాబుకే ఎక్కువ దక్కేది. ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీలో అదనపు బలం ఉండేది. కానీ, ఫలితాలు రివర్స్ కావడం, టీఆర్ఎస్ ఘన విజయం దిశగా దూసుకుపోతుండటంతో వైసీపీ శ్రేణులు ఆనందంగా ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా వారు తెలంగాణ ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో ఉన్న ఆ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సైతం తెలంగాణ ఫలితాల సరళిని పరిశీలించారు.
Next Story