Mon Dec 23 2024 04:26:37 GMT+0000 (Coordinated Universal Time)
'నెల్లూరు నల్ల కుక్క'.. వైసీపీ ఎంపీ ఘాటు ట్వీట్
తాజాగా ఆయన మరోమారు చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. పనిలో పనిగా నెల్లూరు నేత ఆనంపై కూడా ..
అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ అంతా ఇంతా కాదు. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియాను అంత ప్రభావవంతంగా వినియోగించుకోవడం ఏపీ రాజకీయాల్లో వెరీ కామన్ అయిపోయింది. నేతలు కూడా తమకి ఇష్టమొచ్చిన రీతిలో రెచ్చిపోవడం కూడా చూస్తుంటాం. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసే విమర్శలైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ట్విటర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతుంటారు రాజ్యసభ ఎంపీ.
తాజాగా ఆయన మరోమారు చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. పనిలో పనిగా నెల్లూరు నేత ఆనంపై కూడా విరుచుకుపడ్డారు. ప్రపంచంలో ఏం జరిగినా సీఎం వైఎస్ జగన్‌కి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అందుకు నెల్లూరు నేత ఆనం వెంటక రమణా రెడ్డిని బలిపశువుగా ఎంచుకున్నాడని ఆయన విమర్శించారు. పచ్చ స్క్రిప్టులు చదువుతూ అందరికీ కామెడీ పంచుతున్నాడు నెల్లూరు నల్లకుక్క అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
'నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అనే చంద్రబాబు వెకిలి మాటలు. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సీఎం గారికి, YSRCPకి అంటగడతాడు. ఇందుకు నెల్లూరు నల్ల కుక్కను బలిపశువును చేస్తున్నాడు. తలా తోకలేని పచ్చ స్క్రిప్ట్ చదువుతూ కొత్త బిచ్చగాడిలా కామెడీ పంచుతున్నాడు.' అని విజయసాయి ట్వీట్ చేశారు.
Next Story