మేం కూడా ఆధారాలిస్తాం.. అమిత్ షాను కలుస్తాం
టీడీపీ పార్లమెంటు సభ్యులు అమిత్ షాను కలసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడంపై వైసీపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారికి ఆ నైతిక హక్కు లేదన్నారు. ఏపీలో [more]
టీడీపీ పార్లమెంటు సభ్యులు అమిత్ షాను కలసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడంపై వైసీపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారికి ఆ నైతిక హక్కు లేదన్నారు. ఏపీలో [more]
టీడీపీ పార్లమెంటు సభ్యులు అమిత్ షాను కలసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడంపై వైసీపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారికి ఆ నైతిక హక్కు లేదన్నారు. ఏపీలో జరిగిన ఆలయాల్లో దాడులకు టీడీపీ నేతలే కారణమని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. రాజమండ్రిలో విగ్రహం ధ్వంసం కేసులో బుచ్చయ్య చౌదరి అనుచరులు, టెక్కలిలో టీడీపీ నేతలు ఈ ఘటనలలో పోలీసులకు చిక్కారని తెలిపారు. గతంలో అమిత్ షా, మోదీపై టీడీపీ నేతలు చేసిన విమర్శలు మరిచిపోయి ఆయన వద్దకు వెళ్లారని వైసీపీ ఎంపీలు ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో గత ఇరవై నెలలుగా చేస్తున్న వివిధ సంఘటలనకు సంబంధించి తాము కూడా అమిత్ షాకు ఆధారాలు ఇస్తామని వారు చెప్పారు.