సర్కార్ కు ఝలక్ ఇచ్చినా?
శాసనసమండలిలో అధికార పక్షానికి షాక్ తగిలింది. శాసనమండలిలో బలం ఉన్న తెలుగుదేశం పార్టీ మూడు రాజధానుల బిల్లులకు అడ్డుపడింది. రూల్ 71తో అధికార పక్షానికి ప్రతిపక్ష టీడీపీ [more]
శాసనసమండలిలో అధికార పక్షానికి షాక్ తగిలింది. శాసనమండలిలో బలం ఉన్న తెలుగుదేశం పార్టీ మూడు రాజధానుల బిల్లులకు అడ్డుపడింది. రూల్ 71తో అధికార పక్షానికి ప్రతిపక్ష టీడీపీ [more]
శాసనసమండలిలో అధికార పక్షానికి షాక్ తగిలింది. శాసనమండలిలో బలం ఉన్న తెలుగుదేశం పార్టీ మూడు రాజధానుల బిల్లులకు అడ్డుపడింది. రూల్ 71తో అధికార పక్షానికి ప్రతిపక్ష టీడీపీ ఊహించని విధంగా ఝలక్ ఇచ్చింది. మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు బిల్లులను జరిగిన ఓటింగ్ లో తిరస్కరించింది. అయితే ఇందులో బీజేపీ తటస్థంగా ఉండగా, టీడీపీకి చెందిన శివనాధ్ రెడ్డి, పోతుల సునీతలు మాత్రం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం. ఈరోజు బిల్లులపై శాసనమండలిలో చర్చ జరిగే అవకాశముంది. నేడు అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ అధినేత చంద్రబాబు రాత్రంతా తన నివాసంలో సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. బిల్లులపై సవరణలు చేసి సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ వ్యూహం రచిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను శాసనమండలి తిరస్కరిస్తే రేపు అసెంబ్లీ సమావేశం జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సాంకేతికంగా, నైతికంగా ఓడిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బిల్లులపై ఓటింగ్ పెడితే శాసనసభలో ఇతర సభ్యులు కూడా తమకు మద్దతు తెలుపుతారన్నారు. తమ వద్ద మరికొన్ని అస్త్రాలున్నాయని చంద్రబాబు చెప్పారు.
.