సండే ఇక ట్యాంక్ బండ్ పై…?
ట్యాంక్ బండ్ పైన ఆదివారం సాయంత్రం విహారం చేయవచ్చు.. ఇక మీద సాయంత్రం సమయంలో టాంక్ బండ్ పై ఎంజాయ్ చేయవచ్చు.. పిల్లలు పెద్దలు కలిసి హాయిగా [more]
ట్యాంక్ బండ్ పైన ఆదివారం సాయంత్రం విహారం చేయవచ్చు.. ఇక మీద సాయంత్రం సమయంలో టాంక్ బండ్ పై ఎంజాయ్ చేయవచ్చు.. పిల్లలు పెద్దలు కలిసి హాయిగా [more]
ట్యాంక్ బండ్ పైన ఆదివారం సాయంత్రం విహారం చేయవచ్చు.. ఇక మీద సాయంత్రం సమయంలో టాంక్ బండ్ పై ఎంజాయ్ చేయవచ్చు.. పిల్లలు పెద్దలు కలిసి హాయిగా పార్కుల్లో తిరగవచ్చు . ఇందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కూడా దీనిపై స్పందించారు. టాంక్ బండ్ అందాలను చూసేందుకు ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ ను మళ్లీ చాలంటూ సిటీ పోలీసులకు సూచించారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలంటూ సిటీ పోలీస్ లకు మంతి కేటిఆర్ ఆదేశాలు జారీ చేశారు . ఇదే గనుక అమలు అయితే ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్ బండ్ పైన ఎంజాయ్ చేయవచ్చు. 25 సంవత్సరాల క్రితం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు వాకర్స్ కోసం ట్రాఫిక్ ను అనుమతించే వారు కాదు. మారుతున్న కాలం అనుగుణంగా ట్రాఫిక్ పెరిగిపోవడంతో పోలీస్ ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే తాజాగా టాంక్ బండ్ ను పూర్తిగా ఆధునీకరించారు . కొత్త పేవ్ మెంట్ తో పాటు కొత్త కొత్త హంగులను రూపుదిద్దారు. ఈ నేపథ్యంలో టాంక్ బండ్ కు కొత్త అందం వచ్చింది..