రక్తంతో ఈసీకి లేఖ రాసిన యువకుడు
ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు అమేథీకి చెందిన మనోజ్ కశ్యప్ అనే 18 ఏళ్ల యువకుడు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇటీవలి ప్రతాప్ గఢ్ లో ఎన్నికల [more]
ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు అమేథీకి చెందిన మనోజ్ కశ్యప్ అనే 18 ఏళ్ల యువకుడు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇటీవలి ప్రతాప్ గఢ్ లో ఎన్నికల [more]
ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు అమేథీకి చెందిన మనోజ్ కశ్యప్ అనే 18 ఏళ్ల యువకుడు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇటీవలి ప్రతాప్ గఢ్ లో ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీని ఉద్దేశించి ఆయన నెంబర్ 1 అవినీతి పరుడని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించే అమేథీకి చెందిన మనోజ్ మరింత తీవ్రంగా స్పందించాడు. మోడీ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన తన రక్తంతో ఎన్నికల కమిషన్ కు లేఖ రాశాడు. రాజీవ్ గాంధీని విమర్శిస్తే దేశ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, అందుకే ఆయనను విమర్శించకుండా నరేంద్ర మోడీకి ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరాడు. ఇది ఎన్నికల జిమ్మిక్ కాదని, రాజీవ్ గాంధీ 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని, సాంకేతిక విప్లవం తీసుకొచ్చారని, పంచాయితీ రాజ్ వ్యవస్థను తీసుకువచ్చి గ్రామాల్లో మార్పు తెచ్చారని లేఖలో రాశాడు. గతంలో అటల్ బిహారీ వాజ్ పేయి కూడా రాజీవ్ గాంధీని ప్రశంసించారని గుర్తు చేశాడు. మరి, మనోజ్ కశ్యప్ లేఖపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.