పక్కా ఆధారాలు ఇచ్చిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో అవకతవకలు, బోగస్ సర్వేలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు [more]
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో అవకతవకలు, బోగస్ సర్వేలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు [more]
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో అవకతవకలు, బోగస్ సర్వేలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. నకిలీ ఓట్లకు సంబంధించి ఆయన పూర్తి వివరాలను ఈసీకి సమర్పించారు. రాష్ట్రంలో 59.19 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని, అందు 20 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ నమోదై ఉన్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన పెన్‌డ్రైవ్ ను జగన్ ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు తెలుస్తోంది. ఇక, బోగస్ సర్వేలు నిర్వహిస్తూ 4 లక్షల మంది వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించారని జగన్ ఫిర్యాదు చేశారు. దీనికి తోడు ఆయన ఎన్నికల విధుల్లో పోలీసు యంత్రాంగాన్ని టీడీపీని వినియోగించుకునే అవకాశం ఉందని ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. డీఎస్పీలుగా 37 మంది సీఐలకు ప్రమోషన్లు దక్కితే అందులో 35 మంది ముఖ్యమంత్రి సొంత సామాజకవర్గానికి చెందిన వారికి దక్కాయని, వీరిని చంద్రబాబు ఎన్నికల్లో ఉపయోగించుకునే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావు, డీఐటీ శ్రీనివాసరావును కూడా బదిలీ చేయాలని జగన్ ఎన్నికల సంఘాన్ని కోరారు.