మా చిన్నాన్ను నేనే చంపుకుంటానా…??
చంద్రబాబు నేరగాడు కాకపోతే సీబీఐ, ఈడీకి, చూసినా చివరకు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అంటే కూడా ఎందుకు భయపడుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. బుధవారం [more]
చంద్రబాబు నేరగాడు కాకపోతే సీబీఐ, ఈడీకి, చూసినా చివరకు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అంటే కూడా ఎందుకు భయపడుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. బుధవారం [more]
చంద్రబాబు నేరగాడు కాకపోతే సీబీఐ, ఈడీకి, చూసినా చివరకు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అంటే కూడా ఎందుకు భయపడుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. బుధవారం చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ… చంద్రబాబు నేరగాడు కాకపోతే రాష్ట్ర ప్రయోజనాలు వదిలేసి హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయి వచ్చారని ప్రశ్నించారు. బాబు నేరగాడు కాకపోతే ఆయనపై ఉన్న కేసుల్లో స్టేలు ఎందుకు తెచ్చుకున్నారని అడిగారు. అన్ని వ్యవస్థల్లో తన మనుషులను పెట్టుకొని ఎందుకు మేనేజ్ చేసుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబును మించిన నీచుడు లేడని ఆయనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆరే అన్నారని గుర్తు చేశారు.
మాపైనే నిందలా..?
తన చిన్నాన్నను చంపేసి తిరిగి తమ కుటుంబం మీదే నిందలు వేసే దిక్కుమాలిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. చంపింది వాళ్లేనని, విచారణ చేసేది వాళ్లు చెప్పినట్లు వినే పోలీసులని, వక్రీకరించి అబద్ధాలు రాసేది వారి పేపర్లు, అమ్ముడుపోయిన ఛానళ్లని, ఇలా అయితే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు… క్రిమినల్ మినిస్టర్ అనే అర్థాన్ని చంద్రబాబు తెచ్చారని అన్నారు. రిషితేశ్వరి అనే విద్యార్థిని చదువుకోవడానికి వెళ్లి చనిపోతే, అందుకు కారకుడైన బాబురావు అనే వ్యక్తిని అరెస్టు చేయడానికి చంద్రబాబుకు మనసు రాలేదన్నారు. అక్రమ ఇసుక రవాణాను రవాణా అడ్డుకున్న వనజాక్షి అనే ఎమ్మెర్వీని టీడీపీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకొని ఈడ్చుకెళితే చంద్రబాబు చర్యలు తీసుకోలేదన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ నడుపుతున్న మానవమృగాలను కాపాడింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.