కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్
పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయడంపై దృష్టిపెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఇవాళ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని ఆయన అడిగి [more]
పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయడంపై దృష్టిపెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఇవాళ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని ఆయన అడిగి [more]
పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయడంపై దృష్టిపెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఇవాళ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే బస్సుయాత్ర ప్రారంభిస్తానని జగన్ ప్రకటించారు. పార్టీ ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని జగన్ సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించాలన్నారు. 13 పార్లమెంటు నియోజకవర్గాలకు కొత్త పరిశీలకులను ఆయన నియమించారు. ప్రతీ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక పరిశీలకుని చొప్పున నియమించనున్నారు.