పెరిగిన జగన్ గ్రాఫ్..మరో సర్వేలోనూ…!!
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. యాక్సిస్ మై ఇండియా [more]
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. యాక్సిస్ మై ఇండియా [more]
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. యాక్సిస్ మై ఇండియా సంస్థతో కలిసి చేసిన సర్వే వివరాలను ఆ ఛానల్ వెల్లడించింది. ఏపీలో జగన్ ముఖ్యమంత్రి కావాలని 45 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని 36 శాతం మంది, పవన్ కళ్యాణ్ కావాలని 4 శాతం, ఇతరులు కావాలని 15 శాతం కోరుతున్నట్లు తేల్చింది. ఇదే సంస్థ గత సెప్టెంబర్ లో చేసిన సర్వేలో జగన్ కి 43 శాతం, చంద్రబాబుకు 38 శాతం, పవన్ కళ్యాణ్ కు 5 శాతం, ఇతరులకు 14 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.
రెండు శాతం పెరిగిందా…?
అంటే ఐదు నెలల కాలంలో జగన్ కు ప్రజాధరణ రెండు శాతం పెరగగా, చంద్రబాబుకు రెండు శాతం తగ్గింది. ప్రధానమంత్రి పదవి విషయానికి వస్తే నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావాలని 38 శాతం మంది, రాహుల్ గాంధీ కావాలని 51 శాతం, జగన్ కావాలని 5 శాతం, చంద్రబాబు ప్రధాని కావాలని 4 శాతం మంది భావిస్తున్నారు. ఏపీలో నరేంద్ర మోదీ పాలన సంతృప్తికరంగా ఉందపి 33 శాతం మంది, బాగాలేదని 39 శాతం, పర్వాలేదని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు.