ప్రతి పేద గిరిజనుడికి రెండు ఎకరాల భూమి
1.11 లక్షల మంది గిరిజనులకు ఈ పధకం ద్వారా లబ్ది చేకూరుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గిరిజనులకు భూమి కి సంబంధించిన పట్టాలను జగన్ పంపిణీ [more]
1.11 లక్షల మంది గిరిజనులకు ఈ పధకం ద్వారా లబ్ది చేకూరుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గిరిజనులకు భూమి కి సంబంధించిన పట్టాలను జగన్ పంపిణీ [more]
1.11 లక్షల మంది గిరిజనులకు ఈ పధకం ద్వారా లబ్ది చేకూరుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గిరిజనులకు భూమి కి సంబంధించిన పట్టాలను జగన్ పంపిణీ చేశారు. ఒక్కొక్క గిరిజన కుటుంబానికి రెండు ఎకరాల భూమిని కేటాయిస్తున్నారు. ఎటువంటి వివాదాలు లేకుండా క్లియర్ కట్ గా భూమిని గిరిజనుల పేరు మీద పట్టాను పంపిణీ చేశారు. వివాదాలు లేకుండా గిరిజనులకు సంబంధించిన భూములను డిజిటలైజేషన్ చేస్తున్నామన్నారు. గిరిజనుల ఆదాయం పెరగడంతో పాటు అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పెరగాలన్నారు. మొత్తం 3.12 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నామని జగన్ చెప్పారు. సర్వే నిర్వహించి భూములకు హద్దులు నిర్ణయిస్తామని చెప్పారు. వారికి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వర్తింప చేస్తామని చెప్పారు.