Mon Dec 23 2024 11:39:17 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల పోటీ.. అక్కడి నుంచేనట
వైఎస్ షర్మిల తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందే పాదయాత్రను ప్రారంభించారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వేగం పెంచారు. ఆమె ప్రజాప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర దాటేసింది. పాదయాత్రకు విశేష స్పందన వస్తుంది. వైఎస్ షర్మిల తెలంగాణలో పోటీ చేసేందుకు ఆమె సిద్దమవుతున్నారు. వైఎస్సార్టీపీని బలోపేతం చేసే దిశగా ఆమె ఎన్నికలకు రెండేళ్ల ముందే పాదయాత్రను ప్రారంభించారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపై ఆమె నిప్పులు చెరుగుతున్నారు.
పోటీ చేసేందుకు....
ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని తెలిసింది. పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట లాంటిది. 2016 ఉప ఎన్నికల్లో తప్ప అక్కడ అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే వైఎస్ షర్మిల పాలేరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని తెలిసింది.
గ్రౌండ్ వర్క్...
పార్టీ అధినేతగా ఎక్కడో ఒకచోట నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. అది పాలేరుగా షర్మిల డిసైడ్ అయ్యారంటున్నారు. పాలేరులో అయితే సులువుగా గెలుపు అవకాశాలుంటాయని ఆమె భావిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. ఈ నెల 19వ తేదీన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కూడా జరగనుంది. పాలేరు నుంచి తాను పోటీ చేస్తే అసెంబ్లీలోకి అడుగుపెట్టవచ్చని షర్మిల భావిస్తున్నారు.
తొలిసారి పోటీ...
వైఎస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తే తొలి సారి ప్రత్యక్ష్య ఎన్నికలలో పోటీ చేసినట్లవుతుంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా షర్మిల ఇంతవరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఆమె తొలిసారిగా వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తన పార్టీ అభ్యర్థులను కూడా ఆరు నెలల ముందు ప్రకటించేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు.
Next Story