Thu Jan 16 2025 07:54:46 GMT+0000 (Coordinated Universal Time)
విజయమ్మ ఏం చెప్పనున్నారు..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం తర్వాత తొలిసారి ఆయన కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడనున్నారు. గత నెల 25న జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో హత్యాయత్నం జరిగింది. అయితే, ఈ దాడిపై జగన్ కానీ, ఆయన కుటుంబసభ్యులు కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దాడి జగనే చేయించుకున్నాడని, విజయమ్మ, షర్మిల చేయించారని టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు.
రేపు జగన్ బయలుదేరుతుండటంతో....
అయినా వారు ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు. కాగా, రేపు సాయంత్రం జగన్ విజయనగరం జిల్లాలో పాదయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు. ఈ మేరకు ఆయన తల్లి వై.ఎస్. విజయమ్మ రేపు ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. జరిగిన దాడి, ఆ తర్వాత జగన్ కు అందిన చికిత్స, టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై విజయమ్మ స్పందించనున్నారు.
Next Story