వివేకా హత్య కేసు మిస్టరీ వీడుతుందా?
మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసును పోలీసులు ముమ్మరం చేశారు. శాసనసభ ఎన్నికలకు ముందు వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి తెలిసిందే. గత ఏడాది [more]
మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసును పోలీసులు ముమ్మరం చేశారు. శాసనసభ ఎన్నికలకు ముందు వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి తెలిసిందే. గత ఏడాది [more]
మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసును పోలీసులు ముమ్మరం చేశారు. శాసనసభ ఎన్నికలకు ముందు వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చి 15వ తేదీన హత్య జరిగింది. దీనిపై అప్పటి ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అప్పట్లో దాదాపు 60 మందిని విచారించారు. సాక్ష్యాధారాలను తుడిచివేశారన్న కారణంగా కొందరిని అరెస్ట్ చేశారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం రావడంతో వై.ఎస్. వివేకానందరెడ్డి హత్యపై జగన్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వై.ఎస్. వివేకానందరెడ్డి ఇంటి వాచ్ మెన్ రంగయ్యకు నార్కో అనాలిసిస్ టెస్ట్ ను నిర్వహించనున్నారు. ఈరోజు హైదరాబాద్ లో రంగయ్యకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ హత్యలో ప్రొఫెషనల్స్ పాల్గొన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.