విచారణకు పొలిటికల్ లీడర్స్.. .సీబీఐ లిస్ట్ రెడీ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. దాదాపు నెలరోజులుగా సీబీఐ అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. నిన్న గంగిరెడ్డితో పాటు నలుగురు కీలకమైన వ్యక్తులను సీబీఐ [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. దాదాపు నెలరోజులుగా సీబీఐ అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. నిన్న గంగిరెడ్డితో పాటు నలుగురు కీలకమైన వ్యక్తులను సీబీఐ [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. దాదాపు నెలరోజులుగా సీబీఐ అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. నిన్న గంగిరెడ్డితో పాటు నలుగురు కీలకమైన వ్యక్తులను సీబీఐ అధికారులు విచారించారు. ఈ సందర్భంా కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఈరోజు మరికొందరు కొత్త వ్యక్తులను విచారించే అవకాశముందంటున్నారు. త్వరలో రాజకీయ నేతలను కూడా విచారించే అవకాశముందని తెలిసింది. ఈ హత్య కేసులో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న కొందరు రాజకీయ నేతలను విచారించేందుకు సీబీఐ అధికారులు రెడీ అయ్యారు. త్వరలోనే వారికి నోటీసులు జారీ చేసే అవకాశముందని తెలుస్తోంది. వీరిలో వైసీపీ, టీడీపీ, బీజేపీకి సంబంధించిన నేతలున్నారని సమాచారం.