Thu Apr 10 2025 20:46:18 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా అంటే నాకు ఇష్టం.. నేనెందుకు చంపుతాను
తనకు, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధం లేదని ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి తనను బాగా చూసుకునేవారన్నారు. ఆ హత్యలో తన [more]
తనకు, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధం లేదని ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి తనను బాగా చూసుకునేవారన్నారు. ఆ హత్యలో తన [more]

తనకు, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధం లేదని ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి తనను బాగా చూసుకునేవారన్నారు. ఆ హత్యలో తన ప్రమేయం లేదని గంగిరెడ్డి తెలిపారు. వాచ్ మెన్ రంగయ్యతోనూ తనకు పరిచయం లేదన్నారు. తన పేరు ఎందుకు చెప్పాడో తనకు తెలియదన్నారు. వాచ్ మెన్ రంగయ్యను తాను బెదిరించానన్నదీ అవాస్తవమని ఎర్రగంగిరెడ్డి తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డికి తాను ద్రోహం చేసే వ్యక్తిని కాదని గంగిరెడ్డి తెలిపారు. తనను కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతున్నట్లు తనకు అనుమానం కలుగుతుందన్నారు.
Next Story